సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు మాస్ మహారాజా రవితేజ ధమాఖా మరియు హీరో నిఖిల్ 18 పేజెస్ సినిమాలు వచ్చాయి. ఇక సూటిగా సుత్తి లేకుండా ఈ సినిమాల టాక్ ఎలా ఉందంటే మాత్రం.. చాల కాలం తరువాత రవితేజ లోని మాస్ వినోదం మరోసారి ధమాకా చూపించిందని ప్రేక్షకులు అంటున్నారు. నిజంగా వినోదానికి మాత్రం ధమాకా తిరుగులేదని అంటున్నారు. సూపర్ హిట్ కాదుకానీ హిట్ కు డోకా లేదు.. ఇక నిఖిల్ 18 పేజెస్ సుకుమార్ అందించిన ప్రేమ కధతో యువతను ఆకట్టుకొంటుంది. నిఖిల్ సాఫ్ట్ వేర్ గా అనుమపమా పల్లెటూరి అమ్మాయిగా మంచి జంట హిట్ పెయిర్ అనిపిస్తుంది. సంగీతం కూడా టాప్ గా ఉంది. మాస్ కి కనెక్ట్ కాకపోయినా యూత్ టికెట్స్ కు ఢోకా లేదనిపిస్తుంది.
