సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో గత రాత్రి జరిగిన వివాహ వేడుకలు కు వచ్చిన వైసీపీ ప్రముఖులు వరుసగా శ్రీ అమ్మవారిని దర్శించుకోవడంతో భీమవరం పురాధీశ్వరి శ్రీ మావుళ్ళమ్మ దేవాలయం మరింత సందడిగా మారింది. వీరిలో ముఖ్యంగా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని మాజీ మంత్రి ,RK రోజా, భీమవరం M L C కవురు శ్రీనివాస్, విశాఖపట్నంకు చెందిన M L C వరుదు కళ్యాణి, దర్శించుకున్నారు వీరికి ఆలయ ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. నిలువెత్తు బంగారు తల్లిని దర్శించుకొన్నందుకు అదృష్టంగా భావిస్తున్నట్లు , భీమవరం వచ్చినప్పుడల్లా శ్రీఅమ్మవారిని దర్శనానికి వస్తూనే ఉన్నానని రోజా సంతోషం వ్యక్తం చేసారు. వీరికి దేవస్థానం సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదాలు, శ్రీ అమ్మవారి చిత్రపటం అందచేసారు.
