సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో జన్మించి సినీరంగంలో అంచెలు అంచెలుగా ఎదిగిన మహా హాస్య నటుడు స్వర్గీయ అల్లురామలిం గయ్య శత జయంతి సందర్భంగా అయన తనయుడు , ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన స్టూడియో ను నేడు, శనివారం మెగాస్టార్ చిరంజీవి అల్లుస్టూడియోని ప్రారంభించారు. గండిపేటలో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో ఈ స్టూడియోని నిర్మించారు. అల్లుస్టూడియో ప్రారంభోత్స వంలో మెగాస్టార్ చిరంజీవితో అల్లు అర్జున్ తో పాటు అల్లు మొత్తం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చిరంజీవి మాట్లాడుతూ.. ‘అల్లురామలింగయ్య గారి శత జయంతి సందర్భంగా వారికి నా నివాళి.. మా మామయ్య గారు రామలింగయ్య బాటలో అరవింద్, బన్నీ శిరీష్ ,బాబి విజయవం తంగా కొనసాగుతున్నా రు. నాడు నటుడిగా ఎదగాలని రామలిం గయ్య గారి ఆలోచనే నేడు ఓ వ్యవస్ద గా అల్లు కుటుంబం ఎదిగింది. అరవింద్ అగ్ర నిర్మా తగా , మనవలకు స్టార్డమ్ దక్కిం ది. అల్లుస్టూడియో లాభాలను తీసుకురావాలి. అన్నా రు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *