సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్న వైసీపీ అధినేత జగన్ మీడియా సమావేశంలో చూపించిన వీడియో(స్వర్గీయ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తిరుమల ను 7 కొండలుగా ప్రకటిస్తూ ఇచ్చిన జీవో , తిరుమల పరిధిలో అన్య మత ప్రచారం నిషేధిస్తూ ఇచ్చిన మరో జీవో ప్రదర్శించడం, దానికి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒక మత సభలో మాట్లాడుతూ .. ఆ 2 జీవోలను తాను అధికారంలోకి రాగానే తొలగిస్తానని ప్రకటించిన వీడియోలను ) దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో, ట్విటర్, ఇనిస్త్రగ్రామ్ లలో అదే పనిగా వైరల్ కావడంతో దాని ప్రభావం నేడు, శుక్రవారం మండలి సమావేశంపై మరింత పడింది. తిరుమల లడ్డు నెయ్యి లో 2015 నుండి ఇప్పటివరకు ఇండాపూర్ డైర్ సంస్థకు హేరిటేజ్ కు ఉన్న సంబంధాలపై, టీడీటీ తో జరిగిన కాంట్రాక్టు ఒప్పందాలపై చర్చ జరగవలసిందేనని బొత్స సత్యనారాయణ పట్టు పట్టడంతో..నెయ్యి నిగ్గు తేల్చవలసిందేనని వైసీపీ 2 వాయిదా తీర్మానాలు ఇవ్వడంతో ఈరోజు కూడా నేడు వైసీపీ సభ్యుల ఆందోళనతో ఏపీ శాసనమండలిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో ఛైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు సభను కాసేపు వాయిదా వేశారు. వైసీపీ ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, తూమాటి మాధవరావు, మంగమ్మలు, బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఇచ్చిన ఈ తీర్మానాలఫై ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా లేని కారణంగామరోసారి మండలి ఛైర్మన్ మోషేను రాజు తీర్మానాలను తిరస్కరించారు. దీంతో వారు ఛైర్మన్ పోడియం వద్దకు చేరుకుని వేంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్లకార్డులు పట్టుకుని పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్(Minister Payyavula ) ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి నెయ్యి కల్తీని ‘హెరిటేజ్’ కు అంటకడుతూ రాజకీయం చేస్తూ, స్వామివారి ఫొటోలతో వైసీపీ వాళ్ళు ‘దేవుడిని రాజకీయాల్లోకి లాగుతున్నారు.. వైసీపీ సభ్యులకు బుద్ధుందా? లడ్డు వివాదంతో హిందూ గౌరవం, జాతి నమ్మకాన్ని తగ్గించడం, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని పయ్యావుల మండి పడ్డారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *