సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: సంక్రాంతి పండుగ రోజు ఈ సారి భీమవరం లో గడుపుతానని ప్రకటించిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీఐడీ పోలీసులు ఈ నెల 17న తమముండు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో ఆ పర్యటన వాయిదా వేసుకొన్నవిషయం అందరికి విదితమే.. అయితే మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు సీఐ ఎంవీఎస్‌ మల్లేశ్వరరావు ప్రకటించారు. .సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌ను అసభ్య పదజాలంతో దూషించడమే కాక కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చింతలపూడికి చెందిన అంబేడ్కర్‌ మిషన్‌ నాయకులు గొంది రాజు, ఎయిమ్‌ సభ్యుడు కాకర్ల సత్యనారాయణ, ఎంఎస్‌ రాజేంద్ర, బుచ్చిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *