సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒకపక్క అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు పెరగడంతో పాటు బ్రెంట్ క్రూడాయిల్ ధర ఈ ఏడాది గరిష్ఠ స్థాయికి చేరడం తో నేడు, శుక్రవారం దేశీయ మార్కెట్ నష్టాల బారి పడింది. దీంతో మూడు రోజుల వరుస లాభాలకు తెరపడింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ రేట్ల కోతపై ఏర్పడిన అనిశ్చితి, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనం సైతం మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయని విశ్లేషకులంటున్నారు. నేడు, శుక్రవారం సెన్సెక్స్ 1,236.11 పాయింట్లు నష్టపోయి 82,498.14 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,470.05 పాయింట్లు నష్టపోయి 82,264.20 పాయింట్ల కనిష్ఠ స్థాయిచేరింది.. నిఫ్టీ 365 పాయింట్ల నష్టంతో 25,454.35 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్ తగ్గడంతో ..దింతో బంగారం వెండి ధరలు మరోసారి తళుక్కుమన్నాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.18,000 పెరిగి రూ.2.64 లక్షలకు దూసుకుపోయింది. 10 గ్రాముల 24 క్యారెక్ట్స్ బంగారం ధర రూ.1,950 పెరిగి రూ.1,58,650 పలికింది.
