సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత వాతావరణ శాఖ ముందుగా అంచనా వేసినట్లుగానే మన దేశంలోని అండమాన్ నికోబర్ దీవుల తీరాన్ని నైరుతీ రుతుపవనాలు (Southwest Monsoon) తాకాయి. ఈ నెలాఖరులోపు కేరళ తీరాన్ని తాకనున్నాయి. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచండ ఎండలు తో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత సాయంత్రం భీమవరంలో గంట పాటు భారీ వర్షం కుమ్మరించింది. తూర్పుగోదావరి జిల్లాలో , ఏలూరు జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. విజయవాడ లో గత అర్ధరాత్రి నుండి నేటి శనివారం ఉదయం వరకు భారీ వర్షం పడుతూనే ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తాజా సమాచారం ప్రకారం ఏపీ , తెలంగాణ లో శుక్ర, శనివారాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.రాష్ట్రంలో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలతో పాటు ఆకస్మికంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది
