సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత సాయంత్రం మంత్రులపై దాడి నేపథ్యంలో గత రాత్రి పవన్ కళ్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్ లార్జ్ లో పోలీసులు దాడి చేసి పలువురు జనసేన నేతలను అదుపులోకి తీసుకొన్నారు. నేడు, ఆదివారం ఉదయం నుండి పోలీసులు నోవాటెల్ చుట్టూ బారి బలగాలు మోహరించారు. జనవాణి కార్యక్రమంలో పవన్ పాల్గొనాలని, గత రాత్రి పోలీసులు తమవారిని అరెస్ట్ చెయ్యడం దారుణమని పలువురు జనసేన కార్యకర్తలు ఆందోళన చెయ్యగా… మరోప్రక్క విశాఖ రాజధానికి వ్యతిరేకంగా వ్య వహరించిన జనసేన సైనికులను అరెస్ట్ చేయాలని డిమాం డ్ చేస్తూ జె ఏ సి ఆధ్వర్యంలో విశాఖలోని పలు సంఘాల నేతలు, వైసిపి నేతలు , మహిళలు ఆం దోళన చేపట్టారు. పవన్ గో బ్యా క్, గో బ్యా క్ అం టూ నినాదాలు తో పాటు, పవన్ కల్యా ణ్ ఉత్తరాం ధ్ర ద్రోహి అంటూ ఆయన చిత్రపటానికి చెప్పు లతో కొట్టి నిరసన వ్యక్తం చేసిన క్రమంలో విశాఖ పోర్టు స్టేడియం వద్ద మరింత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.దీనితో పలువురు జె ఏ సి నేతలను, వైఎస్ఆర్సీపీ కార్య కర్తలు,ను అడ్డుకొని వారిని పోలీస్ అదుపులో తీసుకోని వ్యానులు ఎక్కించి అక్కడ నుండి తరలించారు.
