సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగువారి ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్‌టీ రామారావు జయంతి వేడుకలను తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఘనంగా నిర్వహిస్తున్నారు. నేటి, ఆదివారంతో ఎన్‌టీఆర్‌కు వందేళ్లు పూర్తయ్యి 101వ జయంతి లో అడుగిడిన నేపథ్యంలో భీమవరంలో ..తెలుగు దేశం ముఖ్య నేతలు నేతలు రాజమండ్రి మహానాడు కు తరలి వెళ్లడంతో రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ అభిమానులు స్థానిక బివి రాజు పార్క్ వద్ద భారీ ఎన్టీఆర్ విగ్రహానికి, ఫిష్ మార్కెట్ వద్ద విగ్రహానికి, నియోజకవర్గంలోని ఎన్టీఆర్ , బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్ అభిమానులు భారీగా పూలమాలలు వేసి తెలుగువారి పౌరుషం గా ఆయన ఘన కీర్తిని మననం చేసుకొని ఘన నివాళ్లు అర్పిస్తున్నారు. నిజానికి ఎన్టీఆర్‌ శత జయంతి తొలి సభ ఒంగోలు వేదికగా జరిగింది. గత ఏడాది మే 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు జరిగిన విషయం విదితమే. తాజగా రాజమండ్రి లో నేడు ఆదివారం మహానాడులో భాగంగా స్థానిక అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు, ఇతర ముఖ్యనేతలు ఘనంగా నివాళులర్పించారు. జూ. ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ , లక్ష్మి పార్వతి తదితరులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘన నివాళ్లు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *