సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో మొగల్తూరు మండలంలో నకిలీ లీజు అగ్రిమెంట్ల్తో గణపవరం స్టేట్ బ్యాంకు కు కోట్లాది రూపాయలు టోకరా వేసిన కేసుపై రాజమండ్రి సీఐడీ రీజినల్ డీఎస్పీ ఆదేశాల మేరకు.. సీఐడీ పోలీసులు దర్యాప్తు లో భాగంగా మొగల్తూరు పోలీస్ స్టేషన్కు వచ్చి విచారణ ప్రారంభించారు. తాజా వార్తసమాచారం ప్రకారం..సీఐడీ ఎస్ఐ ఎండీ గౌస్ మోహిద్దీన్, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణలు అక్కడి స్థానిక నిజమైన రైతులను పిలిపించి వివరాలు నమోదు చేసుకున్నారు. వారి భూములు పరిశీలించారు. మండలంలోని ముత్యాలపల్లి, పేరుపాలెం, మొగల్తూరు గ్రామాల్లోని వ్యవసాయ భూములు, మామిడి తోటల్లో చెరువులు త్రవ్వి ఆక్వా సాగు చేస్తున్నామంటూ కొందరు మోసగాళ్లు బ్యాంకు వారికీ ఫై ఫై మెరుగులు చూపించి నకిలీ లీజు అగ్రిమెంట్లు ఇచ్చి కోట్లాది రూపాయలు రుణం పొందారు. అయితే తీసుకున్న రుణం సకాలంలో చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు రైతులకు నోటీసులు పంపారు. నిజమైన రైతులు తమవద్ద ఉన్న దస్తా వేజులను రెవెన్యూ అధికారులు ఇచ్చిన పత్రాలను బ్యాంకు అధికారులుకు చూపడంతో మోసపోయామని తెలుసుకొని బ్యాంకు ఉన్నతాధికారులు సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐడీ అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని అన్నారు.
