సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నవరస నటన సార్వభౌమ, సినీ నటుడు కైకాల సత్య నారాయణ మృతి పట్ల పలువురు తీవ్ర సంతాపం తెలియజేసారు. .ఆ మహానటుడితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.ఆయనకు భీమవరం బ్యాంకుకాలనీ, తాడేరులో బంధువులు ఉన్నారు. 2019లో భీమవరం వచ్చి 4 రోజులపాటు మిత్రులతో ఉన్నారు. వరుసకు మేనకోడలైన భీమవరం బ్యాంకు కాలనీలోని జయశ్రీ, ఆమె భర్త సాయిదుర్గాప్రసాద్, కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. ఇక పలుమారులు శ్రీ మావుళ్ళమ్మవారిని, శ్రీ పంచారామ సొమేస్వరుని దర్శనానికి రావడం జరిగింది. 1999లో శ్రీమావుళ్లమ్మ ఆలయ 35వ వార్షికోత్సవంలో భాగంగా ఆయనకు సుమారు 40వేలమంది ఆహుతుల సమక్షంలో స్వర్ణ హస్త కంకణంతో ఘనం గా సన్మా నించారు. ఈ సందర్భముగా పురవీధుల గుండా హంసవాహనంపై మంగళవాయిద్యాలతో బాణాసంచా కాల్పులతో జరిగిన ఊరేగింపు గౌరవం కళాకారుడిగా తన జీవితంలో మర్చిపోలేనన్నారు.. ప్రస్తుతం విషాద సందర్భముగా శ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవ కమిటీ, నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఆయన మృతికి తీవ్ర సంతాపం తెలియజేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *