సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, రాజ్యసభ మాజీ సభ్యురాలు, భీమవరం ఇన్ ఛార్జ్ తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరంలోని వారి కార్యాలయంలో ఆదివారం ఆమె మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తొలిసారిగా రెండు సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికీ, చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని, ఎన్నికల్లో అంగన్వాడీలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రాల మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ 86.68 లక్షలు విడుదల చేసి ఒక్కో కేంద్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *