సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వీరవాసరం మండలంలో శరవేగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. భీమవరం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేటి శుక్రవారం సాయంత్రం స్థానిక దుర్గాపురం పట్టణ 31 వ వార్డు బిజెపి నేత మాజీ కౌన్సిలర్ బొడ్డు బాబురావు అనుచరులతోమరియు 2 టౌన్ లో పలువార్డుల నుండి టీడీపీ జనసేన కార్యకర్తలు సుమారు వందమంది ఎమ్మెల్యే శ్రీనివాస్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రకటించారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలు సీఎం జగన్ మరల సీఎం కావాలని, ఆయనకు అండగా ఉండాలని కోరుకొంటున్నారని, 175 కు 175 సీట్లు గెలవవలసిందేనని అన్నారు. భీమవరం నియోజకవర్గంలో తనకు ప్రజలు ఎక్కడకు వెళ్లిన బ్రహ్మరధం పడుతున్నారని , తన హయాంలో సీఎం జగన్ సహకారంతో చేసిన అభివృద్ధి గురించి ప్రజలే తనకు ఎదురొచ్చి చెపుతున్నారని, జనసేన, టీడీపీ బీజేపీ పార్టీలలోని నేతలు కూడా తనకు మద్దతు తెలుపుతున్నారని. వైసీపీ కార్యకర్తల కృషితో ప్రజాబలంతో భారీ మెజారిటీతో తన విజయం ఖాయం అని ధీమా వ్యక్తం చేసారు. ప్రస్తుతం, కూటమి అభ్యర్థి గా పోటీచేస్తున్న అంజిబాబు 10 ఏళ్ళు ఎమ్మెల్యే గా చేసిన కూడా ఎటువంటి అభివృద్ధి చెయ్యలేదని కనీసం కంపోస్ట్ యార్డ్ కూడా ఏర్పాటు చెయ్యలేదని గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారని.. ఆ వీడియో వైరల్ అవుతుందని, రైతులను ప్రజలను మోసం చేసి అంజిబాబు మాత్రమే ఆస్తులు పెంచుకొని అభివృద్ధి చెందాడని అన్నారు. పేదలకు సెంటు భూమి ఇప్పించలేని అంజిబాబు జనసేన అభ్యర్థిగా నిలబెట్టడం విడ్డురమని అన్నారు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్..
