సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కు చెందిన యువతి దంగేటి జాహ్నవి పంజాబ్ లోని ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లో బిటెక్ 3వ సంవత్సరం చదువుతుంది. ఈమెకు అంతరిక్ష పయనం చేయాలని కోరిక.. అదే లక్ష్యంతో అమెరికాలోని నాసా కేంద్రంలో మరియు పోలెండ్ లోని అనలాగ్ ఆస్ట్రోనాట్ లో శిక్షణ పూర్తీ చేసింది. అయితే వ్యోమగామి అవ్వాలంటే అంతర్జాతీయ సంస్థలలో పైలట్ శిక్షణ పొందాలని భావించి మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె తన లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఇటీవల సీఎం జగన్ ను కలసి తన లక్ష్యం నెరవేర్చమని బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లబోయిన వేణుగోపాల్ సహకారంతో అడుగగా సీఎం జగన్ ఆమెను ప్రోత్సహిస్తూ భరోసా ఇచ్చారు. దానితో సీఎం ఆదేశాలతో ప్రభుత్వం తరపున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్మెన్ కవురు శ్రీనివాస్, ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు తాజాగా జాహ్నవి కి సన్మానము చేసి 50 లక్షల రూపాయల చెక్ ను అందజెయ్యడం జరిగింది. దీనితో ఆమె తో పాటు ఆమె కుటుంబీకులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *