సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజా వార్త సమాచారం ప్రకారం.. కోనసీమ అంతర్వేది సాగర తీరంలో ఓ మత్స్యకారుడికి గోల్డెన్​ చాన్స్ అరుదుగా లభించే బంగారు చేపల రూపంలో . సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడి వలకు చేపలు చిక్కాయి. ఈ సారి వల లాగుతుంటే బరువు ఎక్కువనిపించింది. సరే తన పంట పండిందని సహచర జాలర్లతో కలిసి వలను లాగాడు. అంతే ఆశ్చర్యం. ఆ జాలరి ఇంట నిజంగానే బంగారం పండింది. తీరా వలలో బంగారంలాంటి రెండు భారీ కిచిడీ చేపలు చిక్కాయి.జాలరికి జాక్పాట్ వల లో చిక్కిన కిచిడీ చేపల్ని (గోల్డెన్ ఫిష్) ఆ మత్స్యకారుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంతర్వేదిపల్లిపాలెం మినీ ఫిషింగ్‌ హార్బర్‌లో వేలం వేయగా వాటిని అదృష్ట చేపలుగా భావించిన ఓ వ్యాపారి ఏకంగా రూ.4 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో ఆ మత్స్యకారుడు ఆనందం అంతాఇంతా కాదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *