సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి జిల్లాల ప్రజలు ఆరాధ్య దైవం అంతర్వేది లక్ష్మీనర్సింహస్వామి తిరునాళ్లు ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 6 వరకూ జరగనున్నందున జిల్లా మీదుగా వెళ్ళే యాత్రికులకు ఎటువంటి ఇంబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీనిపై ఆర్టీసీ డీఎం రెడ్డన్న మాట్లాడుతూ.. పశ్చిమ గోదావరి జిల్లా లో భీమవరం,నరసాపురం , తణుకు,పాలకొల్లు తదితర బస్టాండ్ ల నుండి జిల్లా వ్యాప్తంగా 60 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. కళ్యాణం జరిగే 31, ఫిబ్రవరి 2వ తేదీ రధోత్సవం, 5వ తేదీ పౌర్ణమి స్నానాలకు ఎక్కువమంది భక్తులు వెళ్లే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా సర్వీసులు నడుపుతామన్నారు. నరసాపురం గోదావరి రేవు మీదుగా వెళ్ళే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా పంట్లు నడుపుతారు. అయితే పడవ ప్రయాణాలుకు అనుమతిలేదు. సబ్ కలెక్టర్ ఆదేశాలతో ప్రయాణికుల కు రక్షణ దృష్ట్యా, ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా బియ్యపుతిప్ప రేవు నుండి ప్రయాణికులను అనుమతి లేదు.. ప్రయాణికులు గమనించాలి.
