సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉభయ గోదావరి జిల్లాల ఆరాధ్య దైవం,పురాణాల ప్రాశస్యం ఉన్న అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాలు ఈ నెల16వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి.అంతర్వేది లక్ష్మీ నర్సింహస్వామి కల్యాణ ఉత్సవాలు ఈ నెల16నుంచి ప్రారంభమవుతాయి.25వ తేదీతో తో ముగుస్తాయి. వీటిలో లక్ష్మి సమేత శ్రీ నరసింహ స్వామివారి కల్యాణలతో పాటు,20వ తేదీన రథోత్సవం, ముగింపు రోజు పౌర్ణమి స్నానాలు కు వేలాదిగా భక్తులు తరలి వస్తారు. దానితో ఆలయ సిబ్బంది, పోలీస్ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులు శ్రీ లక్ష్మి నరసింహుని దర్శించుకొని అక్కడి భారీ తిరునాళ్లలో సముద్ర తీరప్రాంతంలో గోదావరి నది సంగమం అన్న చెల్లెళ్ళ గట్టు దగ్గర ఆహ్లదంగా గడుపుతారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *