సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తో మొన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చర్చలలో తీవ్ర స్థాయిలో మీడియా ఎదుట, ముఖాముఖీ ఒకరిని ఒకరు నిందించుకోవడం .. ట్రంప్ తో కలసి మర్యాదపూర్వక విందులో కూడా జెలెన్స్కీ పాల్గొనకుండా కోపంగా వెళ్లిపోవడం చూసి ప్రపంచం విస్తుపోయింది.మరోసారి జెలెన్స్కీ కి వైట్ హౌస్ తలుపులు తెరుచుకోవని ప్రకటించారు. రష్యా వినోదించింది. అయితే ఇతర ఐరోపా దేశాల నేతల దౌచ్యంతో ఇంతలోనే వారిరువురు ప్రపంచాన్ని మరోసారి విస్తు పోయేలా మరో సారి చర్చలు జరుపుకోవడానికి సిద్ద పడుతున్నారు. ఉక్రెయిన్ భవిషత్తు రక్షణ కోసం మరో మారు సామరస్య పూర్వకంగా వస్తే జెలెన్స్కీ తో చర్చిస్తానని ట్రంప్ ప్రకటించడం.. దానికి ప్రతిగా జెలెన్స్కీ అమెరికాతో సత్సంబంధాలను కాపాడుకోగలనని, ఖనిజాల ఒప్పందంలో గత వారం ఏకాభిప్రాయం కుదరలేదని, నిర్మాణాత్మక చర్చ కోసం ట్రంప్ ఆహ్వానిస్తే మరోసారి భేటీ కి వెళ్తానని, తాను సిద్ధమని నేడు సోమవారం తాజగా ప్రకటించారు. మరోవైపు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మాట్లాడుతూ.. ఐరోపా భద్రత కోసం ఉక్రెయిన్‌కు మంచి జరిగే ఒప్పందంతోనే ప్రతి దేశ భద్రత ఆధారపడి ఉందని అన్నారు.
