సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పోలీస్ రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ,మాజీ మంత్రి కన్న బాబు నేడు, మంగళవారం కలసి ములాఖత్ లో కొద్దీ సేపు మాట్లాడి సంఘీభావం ప్రకటించారు. తదుపరి ఉండవల్లి.. మీడియాతో మాట్లాడుతూ .. ఇటీవల రాష్ట్రంలో సీఎం చంద్రబాబు కొత్త పద్దతిలో పాలనకు శ్రీకారం చుట్టారని అని ఎద్దేవా చేసారు. ఏపీలో ప్రభుత్వాన్ని విమర్శించిన వారిని ప్రశ్నించిన వారిని జైలులో వేస్తారని , వారిపై ఇళ్లపై పడి అన్ని ధ్వంసం చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తారని విమర్శించారు. ఇటీవల ప్రభుతాన్ని విమర్శించిన వారిపై కొందరు పెట్రోల్ బాంబులతో దాడులు చెయ్యడం వారికీ తక్షణం బెయిల్ ఇవ్వడం.. ప్రశ్నించినవారిపై మాత్రం రాష్ట్రంలో 30 చోట్ల నుండి 30 రకాల కేసులు పెట్టి జైలులో వేసి బెయిల్ రాకుండా చెయ్యడం దారుణం అని విమర్శించారు. ఇది కేవలం కక్ష సాధింపు చర్యలే.. క్లియర్ గా అందరికి తెలిసిపోతుంది అని విమర్శించారు. తిరుమల లడ్డులో జంతు కొవ్వులు లేవని దర్యాప్తు రిపోర్టు లలో చెపుతుంటే.. సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు ఇలా మాట్లాడటం, ఇంకా బాత్రూం రసాయనాలు కూడా లడ్డులో.. అనటం దైవ ద్రోహం క్రిందకు వస్తుందని ఘాటుగా స్వాదించారు ఉండవల్లి. ఇదిలా ఉండగా అంబటి రాంబాబుకు ఒక కేసు లో బెయిల్ రాగా, మరో కేసులో ఈ నెల 22వ తేదీ వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీనితో పాటు ఎన్నో పాత కేసులు కొత్త కేసులుతో ప్రస్తుతం అంబటి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *