సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. సీఎం నారా చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతల ఫిర్యాదుతో గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు..గుంటూరు లోని అంబటి రాంబాబు ఇంటి ముట్టడికి నేడు,శనివారం టీడీపీ కార్యకర్తలు, తెలుగు మహిళలు యత్నించటం అయన కారు , ఇంటి కిటికీ అద్దాలు పగుల గొట్టడంతో గుంటూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళ్తే.. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై చంద్రబాబు, పవన్ తప్పుడు ప్రచారం చేసారంటూ దానికి వైసీపీ పాప ప్రక్షాళన పేరుతో పూజల కార్యక్రమం చేపట్టింది. ఇందులో పాల్గొనేందుకు అంబటి రాంబాబు గోరంట్లకు బయల్దేరారు. ఈ క్రమంలోనే పెద్దఎత్తున వైసీపీ, టీడీపీ శ్రేణులు ఎదురెదురు పడ్డాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సమయంలో తనను అడ్డుకొంటున్న టీడీపీ నేతలపై సహనం కోల్పోయిన అంబటి రాంబాబు.. పనిలో పనిగా . సీఎం చంద్రబాబు పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈనేపథ్యంలో నేడు టీడీపీ నేతలు,మహిళా నేతలు అయన ఇంటి ముట్టడికి పాల్బడ్డారు. దీనిపై అంబటి తాజగా స్వాందిస్తూ .. నేను చంద్రబాబు నుద్దేశించి అనలేదు. ఆవేశంలో కొన్ని మాటలు ద్రోలి ఉంటె కేసులు పెట్టుకోండి. నాపై టీడీపీ నేతలు ఇప్పుడు చేసిన దాడికి కూడా కేసులు పెట్టాలి. తిరుమల లడ్డు ఫై మా వైసీపీ నేతల బొమ్మలతో టీడీపీ ఫ్లెక్సీ లు కట్టితే పోలీసులు చర్యలు లేవు.. కానీ మీరు నాపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేద్దామనుకుంటే ‘నా ఇంట్లో కుక్క లు కూడా మీకు భయపడవు‘ డోంట్ కేర్.. అంటూ అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
