సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తనపై కర్రలతో దాడి చేసినవారితో పాటు సీఎం ను బూతులు తిట్టారని ఆరోపణలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులులో నిందితుడుగా ఉన్న వైసీపీ కీలక నేత, రాష్ట్ర మాజీ మంత్రి, అంబటి రాంబాబుకు( Ambati Rambabu) మరో కీలక కేసులో బెయిల్ మంజూరైంది. గతంలో పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు.. ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అలాగే ఆయనపై పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌నూ కూడా కొట్టివేసింది న్యాయస్థానం. ప్రస్తుతం.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి రాంబాబు .. ఇక కొత్తగా ఏ అడ్డంకి లేకపోతే ఈ బెయిల్‌తో రేపు(గురువారం) జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
