సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అన్ని కేసులలోనూ కూడా బెయిల్ రావడంతో ఎట్టకేలకు గత బుధవారం సాయంత్రం అంబటి రాంబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. ఈ క్రమంలోనే గత్ రాత్రి మీడియా సమావేశంలో అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తనను బయటకు రాకుండా అడ్డుకోవాలని ప్రభుత్వ పెద్దలు చూశారని, తనను చంపడానికి కూడా చూశారంటూ అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేశారు. తాను ఎన్ని రోజులైనా జైలులో ఉండేందుకు సిద్ధపడే వెళ్లినట్లు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వైసీపీ పార్టీ కోసం అధినేత జగన్ కోసం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి రెడ్ బుక్ రాజ్యాంగాల కైనా ఎన్ని అక్రమ కేసులు పెట్టిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. మరోవైపు జైలులో ఉన్నప్పుడు తాను బాధపడలేదని జైలు జీవితాన్ని కూడా ఎంజాయ్ చేశానని అన్నారు. తన ఇంటిపై దాడి చేశారని.. తన కుటుంబాన్ని వేధించారని, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం నిజానికి బాధితులను జైళ్లో వేసి, నేరస్థులను వదిలేశారంటూ ఇది రాష్ట్ర ప్రజలు బాగా గమనించారని అంబటి రాంబాబు ఆరోపించారు.దొంగ ఆరోపణలతో కల్తీ నెయ్యి వివాదం చేసినవారిని దేవుడు చూసుకోవడం మొదలు పెట్టాడని, తన ఇంటిపై దాడి చేశారని.. తన కుటుంబాన్ని వేధించారన్న అంబటి రాంబాబు.. అన్నింటికీ దేవుడే సమాధానం చెబుతారన్నారు. వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలోఅంబటి రాంబాబుకు ఘనంగా స్వాగతం పలికారు.
