సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్ వద్ద భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ వేసిన దారిలో దేశ అభివృద్ధి కోసం సామాజిక న్యాయం కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆ మహనీయుని స్మరించుకుంటూ వారి ఆశయాల నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఏపీఐఐసీ చైర్మన్,టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కలిదిండి వినోద్ వర్మ,పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
