సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేనాని పోటీ చేస్తున్న పిఠాపురం లో వరుసగా 3 రోజులు పర్యటిస్తానని ప్రకటించిన జనసేనాని పవన్ పర్యటన ఎవరు ఊహించని విధంగా నేడు, ఆదివారం రెండో రోజు పర్యటన రద్దు కావడంతో వారు నిరాశకు గురి అయ్యారు.. పవన్ 2వ రోజే హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ లోని తన నివాసానికి పయనం అయ్యారు. ఆయన . తిరిగి రేపు , సోమవారం ఉదయం పిఠాపురంకు వస్తానని తెలిపారు. కాగా దీనితో ఈరోజు పిఠాపురంలో జరగాల్సిన జనసేన , టీడీపీ కార్యకర్తల కీలక సమావేశం రద్దు అయింది. రేపు సోమవారం నుండి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన కొనసాగుతుందని పార్టీ షెడ్యూలు ప్రకటించింది. పవన్ కల్యాణ్ తొలి విడతలో దాదాపు 10 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 12 వరకు ఆయన పర్యటనలు ఉంటాయి. ఏప్రిల్ 2 వరకు ఆయన పిఠాపురంలో ఉంటారు. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఉగాది పర్వదినం సందర్భంగా 9వ తేదీన పిఠాపురంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం 10వ తేదీన రాజోలు, 11న పీ గన్నవరం, 12న రాజానగరం బహిరంగ సభల్లో పాల్గొంటారు.
