సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూరులో ఎదో జరుగుతుంది. అనూహ్య సంఘటనలుతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేవలం ఐదు రోజుల్లో 98 మంది గుండెపోటు, మెదడు పోటు బారినపడి ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 44 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూయగా, 54 మంది చికిత్సకు ముందే ప్రాణాలు విడిచారు. ఈ వివరాలను ఎల్‌పీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ తెలిపింది.ఒక వారంలో 723 మంది హృద్రోగులు ఈ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ, ఔట్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్‌కు వచ్చారు. వారిలో నడి వయ్యస్సు వారే ఎక్కువమంది ఉన్నారట..14 మంది రోగులు గత శనివారం గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు రోగులు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత ఆదివారం ఎనిమిది మంది ఆసుపత్రికి చేరుకునేలోగానే ప్రాణాలు కోల్పోయారు. మొత్తానికి ఈ మిస్టరీని ఛేదించడానికి వైద్య అధికారులు సిద్ధమయ్యారు.
