సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల బిగ్ బాస్ టివి హోస్ట్ గా పాపులర్ అయిన అక్కినేని నాగార్జున ఎపుడో మనం’ సినిమా తరువాత గట్టి హిట్ కొట్టి చాల సంవత్సరాలు అయ్యింది. ఇటీవల పాన్ ఇండియా సినిమా బ్రహ్మస్త్ర లో నంది గా కీలక రోల్ పోషించారు. అయితే ఇప్పటివరకు 99 సినిమాలు చేసిన నాగార్జున ఇక తాను చెయ్యబోయే 100 వ సినిమా మాత్రం భారీ బడ్జెట్ తో ప్రతిష్టాకరంగా ఉండేలా ప్లాన్ చేసుకొంటున్నారు. ఇటీవల చిరంజీవి, సల్మాన్ ఖాన్ తో ‘గాడ్ ఫాదర్’ చేసిన దర్శకుడు మోహన్ రాజా నాగార్జున కి ఒక కథ వినిపించాడని, అది ఫైనల్ అయ్యిందని అందులో అఖిల్ అక్కినేని కూడా నటించబోతున్నారని ఫిల్మ్ వర్గాల టాక్.. మోహన్ రాజా మొత్తం స్క్రిప్ట్ పని పూర్తి చేసాక అధికారికంగా ప్రకటించనున్నారు.
