సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం ప్రముఖ సీనియర్ నటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు శతజయంతి సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకి చెందిన చాలామంది సెలబ్రిటీస్, అలాగే ఇతర రంగాలకి చెందిన వారు అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని విగ్రహావిష్కరణ సందర్భంగా హాజరయ్యారు, వీరిలో మహేష్ బాబు, రామ్ చరణ్, నాని, మంచు విష్ణు, శ్రీకాంత్, జగపతి బాబు, మోహన్ బాబు, అశ్విని దత్, కె ఎల్ నారాయణ, కీరవాణి, తదితరులు అన్నపూర్ణ స్టూడియోస్ కి తరలి వస్తున్నారు. వచ్చిన వాళ్ళను అందరినీ నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, సుమంత్, సుప్రియ సాదరంగా ఆహ్వానిస్తూ వాళ్ళని దగ్గరుండి కూర్చోబెడుతున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుతో అక్కినేని నాగేశ్వరరావు కాంస్య విగ్రహావిష్కరణ కావించారు. ఆయన పిల్లలుగా మా నాన్నగారికి చేయగలిగేది ఇటువంటి మంచి పనులే అని అక్కినేని నాగార్జున అన్నారు.
