సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు,ఆదివారం మంగళగిరి లో జరిగిన జనసేన లీగల్‌సెల్ సమావేశం లో క్యాడర్ నుద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ … తన జీవితంలో చేసిన మంచి పని జనసేన పార్టీ పెట్టడమన్నారు. 2019లో ప్రజలు ఏ ఉద్దేశంతో వైసీపీకి ఓటు వేశారో గానీ.. దాని పర్యావసానం ఇప్పుడు అనుభవిస్తున్నారని పవన్ కల్యాణ్‌ అన్నారు. ఇటీవల ప్రజలలో జనసేనకు ప్రజాదరణ పెరుగుతోందన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో జనసేన జెండా ఎగరాలని అన్నారు. అయితే గెలిచేవరకు మళ్లీ మళ్లీ దెబ్బలు తినడానికి సిద్ధమని స్పష్టం చేశారు. జనసైనికులు జనసేనకు బలమైన స్థానాలను గుర్తించి అక్కడ బాగా పని చేయాలని సూచించారు. (మిగతా స్థానాలు పొత్తు పెట్టుకొనే పార్టీలకు..?) గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగే అభ్యర్థులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. అయితే ముందుగా ప్రకటించినట్లు అక్టోబర్‌లో విజయదశమి కి తాను చేపడతానన్న జనసేన యాత్ర వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో అధికారపార్టీ వైసీపీ ఎన్ని సీట్లు గెలవబోతోందనే విషయంపై పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు…. ఓ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 47-67 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వైసీపీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *