సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణాలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారాను మోగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తం అవుతోంది. అన్ని అనుకూలిస్తే వచ్చే అక్టోబరు రెండో వారంలోగా షెడ్యూల్ను ప్రకటించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబరు మొదటివారంలో ప్రధానఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల బృందం రాష్ట్రానికి రానుంది. అయితే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రస్తుత గడువు వచ్చే ఏడాది జనవరి 16 వరకు ఉంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఇదే గడువు. మిజోరం అసెంబ్లీ గడువు మాత్రం ఈ ఏడాది డిసెంబరు 17తో ముగియనుంది. దీనితో తెలంగాణతో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాలకు ఒకే దఫా షెడ్యూ లును ఈసీ ప్రకటించనుంది. మరోపక్క ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ తెలంగాణలో లో ముమ్మ రంగా సాగుతోంది.. నవంబరు 4న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. ఈసారి అధికారం కోసం బిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నువ్వా నేనా అన్నస్థాయిలో తలపడే సూచనలు ఉండగా, బీజేపీ కూడా ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో పాగా వెయ్యాలని కసరత్తులు చేస్తుంది మరి
