సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : భీమవరం మునిసిపల్ కమిషనర్ శివరామ కృష్ణ అవినీతితో అక్రమ ఆస్తులు కూడబెట్టాడన్న ఆరోపణలతో , ఫిర్యాదులతో నిన్న ఏకకాలం లో 9 చోట్ల రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు నేడు, గురువారం 2వ రోజు దర్యాప్తు ను ఎక్కవగా ఆయన స్వస్థలం విజయవాడ ఫై కేంద్రీకరించారు. భీమవరం మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ ను విజయవాడ తరలించి ఆయన బ్యాంకు లాకర్లు ను గుర్తించి వాటిలో విలువైన పత్రాలు సేకరణతో తో పాటు ఆయనకు సంబదించిన ఒక అపార్ట్మెంట్ ప్లాట్ లో అధికారులకు కీలకమైన మరిన్ని ఆస్థి పత్రాలు లభ్యం అయ్యాయని భావిస్తున్నారు. ఈ రోజుల సోదాలు లో రూ.60 కోట్ల విలువ కలిగిన అక్రమాస్తులు? గుర్తించినట్లు సమాచారం. ఆయన చేసిన అవినీతికి తన వాటా వసూళ్ల కోసం ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకొన్నారని, విదేశీ యాత్రలు కూడా చేసారని వాటి వివరాలను ఆధారాలను ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు. విచారణ కొనసాగుతుందని విచారణ పూర్తీ చేసాక కమిషనర్ శివరామ కృష్ణ ను అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్ట్ లో ప్రవేశపెడతామని డిఎస్పీ శ్రీనివాస్ ప్రకటించారు.
