సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, దొంగతనం చేశాడు అన్న అనుమానంతో భీమవరం చినరంగాని పాలెంకు చెందిన వై. కోటేశ్వరరావు( బాబీ) అనే బొమ్మల వ్యాపారి, ఆటో డ్రైవర్ తనకు సన్నిహితుడిగా ఉండే మరో ఆటో డ్రైవర్ కాటూరి దుర్గారావు (28) ను హత్య చేశాడని ఆ కేసును ఛేదించామని భీమవరం డిఎస్పి రావూరి గణేష్ జై సూర్య తెలిపారు. నేడు, శనివారం ఉదయం భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వన్ టౌన్ సీఐ నాగరాజు, ఎస్సై కృష్ణాజీ తో కలసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాటూరి దుర్గారావు హత్యకు సంబంధించి వివరాలను తెలియజేశారు. భీమవరం మూడవ పట్టణం చినరంగనిపాలెంలో ఉండే మృతుడు దుర్గారావు ఈనెల నాలుగవ తేదీ నుండి కనిపించకుండా పోయాడని కాటూరి దుర్గారావు సోదరుడు కాటూరి నాగరాజు తమకు ఈనెల 21వ తేదీన వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడన్నారు.. హత్యకు కారణాలు ఏవంటే..రెండు సంవత్సరాల క్రితం భార్య వదిలేసి వంటరిగా ఉంటున్న దుర్గారావుకు అదే ప్రాంతంనకు చెందిన యల్లా కోటేశ్వరరావు ( బాబీ)తో పరిచయం ఏర్పడిందని కోటేశ్వరరావు కూడా తన మొదటి భార్య నుండి విడిపోయాడని అనంతరం షేక్ మేరీని వివాహం చేసుకున్నాడన్నారు. మొదటి భర్త వలన కలిగిన ఇద్దరు సంతానం మేరీకి ఉన్నారన్నారు. ఒక కుమారుడికి 17 సంవత్సరాలు ,మరో కుమారుడికి 15 సంవత్సరాలని అయితే వారు తల్లితో ,సవతి తండ్రితో కలిసి చినరంగనిపాలెంలో ఉంటున్నారని డిఎస్పి జై సూర్య తెలిపారు. ఈనెల 4వ తేదీన యల్లా కోటేశ్వరరావు అతని కుమారుడు జాన్ లు అక్కడికి వచ్చి దొంగతనం ఆరోపణలతో దుర్గారావును వారితో పాటు తీసుకువెళ్లి తీవ్రంగా దాడి చేశారన్నారు. దుర్గారావు కాళ్లు చేతులు కట్టేసి నోటిలో గుడ్డలు పెట్టి ఎరువుల సంచులతో కుట్టిన పెద్ద సంచిలో అతనిని ఉంచి 4 వ తేది రాత్రి ఆటోలో దుర్గారావు ను ముద్దాయి సొంత ఊరు అయిన రావులపాలెం సమీపంలోని వెదురేశ్వరం తీసుకు వెళుతూ మార్గ మద్యంలో సంచిని విప్పి దుర్గారావు నోటిలో గుడ్డలు బాగా కుక్కి అరవకుండా నోటికి తాడు కట్టి సంచి మూతిని మరల గట్టిగా బిగించి కట్టి ఆటో కేసి బలంగా సంచిని కొట్టి దుర్గారావును చంపేసి ఆ శవాన్ని ముద్దాయిలు మోటార్ సైకిల్ పై జొన్నాడ గ్రామంలోని కోటిపల్లి కాలవలో పడవేసి ఇంటికి వచ్చేసారన్నారు. తాము మృతదేహాన్ని గుర్తించి మృతదేహం దొరికిన ప్రదేశం లోనే పంచనామా, పోస్టుమార్టం నిర్వహించామన్నారు. ప్రథమ ముద్దాయి యల్లా కోటేశ్వరరావు అలాగే హత్య తో ప్రమేయం ఉందని భావించిన షేక్ మేరీని అరెస్టు చేసామన్నారు. మూడవ ముద్దాయి మైనర్ కావడంతో దానికి సంబంధించి విచారణ చేస్తున్నామని డిఎస్పి జయ సూర్య తెలియజేశారు. హత్యకు వినియోగించిన రాడ్ ను, సుత్తిని ,సంచిని, మృతుడి సెల్ ఫో ను మీడియాకు ప్రదర్శించారు,
