సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అక్షయ తృతీయ సమయంలో బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. కానీ ఈసారి మాత్రం పెరగవలసిన ధరలు కంటే ఇంకా భారీ ధరలు ముందే పెరిగిపోవడంతో తృతీయ దగ్గర పడుతున్న సమయంలో బంగారం ధరలు తగ్గాయి. నేడు సోమవారం మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,530గా ఉంది. నిన్నటి ఆదివారంతో పోలిస్తే రూ.680 తగ్గింది. ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.
