సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజమండ్రి లోని పుష్కర ఘాట్ వద్ద అఖండ గోదావరి ప్రాజెక్టు (Akhanda Godavari )కు నేడు, గురువారం ఉదయం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నిమ్మల రామానాయుడు (Nimmala ), కందుల దుర్గేష్ , ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (MP Purandeswari) స్థానిక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. రాజమండ్రి అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరం అన్నారు. అలాగే డొక్కా సీతమ్మ, ఆదికవి నన్నయ్యకు జన్మనిచ్చిన నేల గోదావరి తీరమని అందుకే ఈ ప్రాంత విశిష్టత మరింత పెంచేలా అందరికి తెలిసేలా ఇక్కడ రూ.430 కోట్లతో ఏపీలో పర్యాటక ప్రాజెక్టులు చేపడుతున్నట్లు ప్రకటించారు.డబుల్ ఇంజన్ సర్కార్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా అభివృద్ధి చేస్తున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీలో 974 కిలోమీటర్ల నదీ తీరం ఉందని, విదేశాల్లో నదీ తీరాలను పర్యాటక రంగంగా అభివృద్ధి చేసిన విధంగా అఖండ గోదావరి ప్రాజెక్టును పర్యాటకంగా తీర్చిదిద్దుతామన్నారు.
