సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ నెల 20వ తేదీ రాత్రి సమయంలో భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం బాలేపల్లి గ్రామంలో ని దళిత పేటలో మూడు గృహాలు అగ్నిప్రమాదం లో పూర్తిగా కాలిపోయిన నేపథ్యంలో ఆయా అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ఈరోజు ఆదివారం సాయంత్రం శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు గారు పరామర్శించారు. మండల YSRCP SC విభాగం వారిచే ఏర్పాటు చేయబడిన బియ్యం, వంట సామగ్రి, దుప్పట్లు, ను బాధిత కుటుంబాలకు కొయ్యే మోషేను రాజు అందజేసి వాటితో పాటు కొంత ఆర్ధిక సహాయం అందచేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తరపున రావాల్సిన అన్ని పథకాలు మరియు నూతన గృహాలు మంజూరు చేయించడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో YSRCP క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మేడిది జాన్సన్ కూడా పాల్గొన్నారు
