సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: ప్రకాశం జిల్లా మార్కాపురం లో నేడు, బుధవారం జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్.. రాష్ట్రవ్యాప్తంగా అగ్రవర్ణాలు అయిన రెడ్డి, కమ్మ , ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద మహిళలకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి వారి అకౌంట్స్ లోకి విడుదల చేశారు. ఈ సందర్భముగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో ఏ కుటుంబాన్ని తీసుకున్నా .. ఏ గ్రామాన్ని తీసుకున్నా.. ఏ జిల్లాను తీసుకున్నా.. గత ప్రభుత్వంలో ఇంటింటికీ జరిగిన మంచి ఎంత? ఈ ప్రభుత్వం హయాంలో జరిగిన మంచి ఎంత? బేరీజు వేసుకోగల సత్తా చంద్రబాబుకు ఉందా? అంటూ సవాల్ విసిరారు.‘‘ఈ నిజాలు ప్రజలకు తెలుసు… ఇంటింటికీ తెలుసు.. మనిషి మనిషికీ తెలుసు.. అందుకే నిజాలు దాస్తున్నారు… పచ్చమీడియా .. ఒకే అబద్ధాన్ని పదేపదే ప్రచారం చేసి..నిజాన్ని నమ్మిం చే ప్రయత్నం చేస్తున్నారు. వీరు గత ఐదేళ్ల హయాం లో ఒక్క ఇళ్లస్థలమైనా ఎందుకు ఇవ్వ లేకపోయారు. మనం ఇచ్చిన 30 లక్షల ఇళ్లపట్టాల విషయాన్ని చెప్పం డి. అలాంటి ఇళ్లస్థలాల ముందు చంద్రబాబు కు సెల్ఫీ దిగే నైతికత ఉందా? అని ప్రజలు ప్రశ్నించండి’’ అని సీఎం జగన్ అన్నా రు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *