సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విభిన్న చిత్రాలతో హిట్స్ కొట్టే యువహీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా ‘షానియల్ డియో’ దర్సకత్వంలో నేడు, శుక్రవారం ‘డెకాయిట్’ సినిమా నేడు, ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు. సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మించారు. హీరో అడవి శేష్ స్వయంగా కధ, స్క్రీన్ ప్లే అందించారు. ఇక ఈ సినిమా కధ విషయానికి వస్తే.. దళిత వర్గానికి చెందిన యువకుడు హరి దాస్ అలియాస్ రోమియో (అడివి శేష్).. అగ్ర వర్ణానికి చెందిన సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాల్ ఠాకూర్) ప్రేమించుకుంటారు. ఒకరికొకరు ప్రాణంగా బతుకుతున్న నేపథ్యంలో, అనుకోని పరిస్థితుల్లో ఓ హత్య కేసులో హరి జైలు పాలవుతాడు. ఆశ్చర్యకరంగా హరినే ఆ నేరం చేశాడని నమ్మించి అతనికి శిక్ష పడేలా చేస్తుంది సరస్వతి. ప్రాణంగా ప్రేమించిన అతన్ని ఆమె ఎందుకు జైలుకు పంపింది..? అసలు సరస్వతి గతం ఏంటి..? అన్నదే ఈ చిత్ర కథ.. ఇక సినిమా ఎలా ఉందంటే.. అడవి శేష్ . గత సినిమాలతో పోలిస్తే ఇది కాస్త బలహీనం. అయితే సినిమా నిరాశ పరచదు.అడవి శేష్ అందించిన కథ రొటీన్ గానే ఉంది. అయితే స్క్రీన్ ప్లే కాస్త కొత్తగా ఉంది. ముఖ్యంగా మొదటి అరగంట చాలా బాగా వచ్చింది. ఎమోషన్స్ తో కూడిన ఒక బలమైన పాయింట్ ను దర్శకుడు షానియల్ డియో ఎంచుకున్నాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, హీరోయిన్ కోణంలో వచ్చే సన్నివేశాలను తెరపై బాగా ప్రెజెంట్ చేశాడు. స్లోగా సన్నివేశాలు సాగుతున్న అనుభూతి సెకండ్ హాఫ్ లో కనపడుతుంది. అడవి శేషు, మృణాల్ పోటీపడి నటించారు. అయితే ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్ లాంటి పెద్ద నటులకు తగిన పాత్రలు లేవు. అయితే క్లైమాక్స్ లోని ఎమోషనల్ సీన్స్ తో కథనాన్ని ముగించిన తీరు మెప్పిస్తుంది. ఫొటోగ్రఫీ, రీమిక్స్. పాటలు ,రిరికార్డింగ్ బాగున్నాయి. మరి మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా ఏ మేరకు కనెక్ట్ అవుతుందనేది చూడాలి.. sigmatelugu.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *