సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో నిత్యావసర వస్తువులు ధరలు గత ఎన్నికల ముందుతో పోలిస్తే ఈ 5నెలలులో కనివిని ఎరుగని రీతిలో పెరిగి పోతున్నాయి. గత లో 25 రూపాయలు ఉండే ఉల్లి పాయల ధరలు అసలు కేజీ 70 రూ నుండి అసలు దిగిరావడానికి ఇష్టపడటం లేదు. ఇక వెల్లులి అయితే 200 శాతం ధరలు పెరిగిపోయి కేజీ 500 కు ఎగబాకుతుంది. జీడిపప్పు ధరలతో వెలుల్లి పోటీ పడే రోజులు వస్తాయని ఎవరు ఉహించి ఉండరు. ఒక ప్రక్క మధ్య తరగతి ప్రజలు ఆదాయాలు పెరగక ఉన్న జీతం సరిపోక ప్రభుత్వ పధకాలు అందుకోలేక మరో ప్రక్క పిల్లలకు పెరిగిపోయిన విద్య సంస్థల ఫీజులు చెల్లించలేక తీవ్రంగా మనోవ్యధ చెందుతున్నారు. సామాన్య, మధ్య తరగతుల జీవితం దుర్భరమవుతుంది. సన్న బియ్యలు 25 కేజీల ప్యాకెట్ కొనాలంటే కనీసం 1500 రూ పైగా పెట్టవలసిందే..ముఖ్యంగా నూనెల ధరలు పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో సన్ ఫ్లవర్ ఆయిల్ లీటర్ ధర రూ. 115 నుంచి 150కి పెరిగింది. కిరాణా షాప్ లో లీటర్ ధర సన్ ఫ్లవర్ ఆయిల్ రూ. 155 నుంచి 160 వరకు అమ్ముతున్నారు. దసరా పండుగకు ముందే పామాయిల్ లీటర్ ధర రూ. 95 ఉండగా ఇప్పుడు రూ. 130కి పెరిగింది.దీపారాధనకు ఉపయోగించే నూనె సైతం 130కి చేరింది.
