సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలోని రైల్వే ప్రయాణికులకు అతి సులభమైన రీతిలో , సమగ్రమైన డిజిటల్‌ సేవలు అందించడంలో భాగంగా రైల్వేశాఖ ‘రైల్‌వన్‌’ అనే యాప్‌ను మార్చి 1నుంచి అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుతమున్న యూటీఎస్‌ మొబైల్‌యాప్‌ ప్రయాణికులకు సరిగ్గా ఉపయోగపడడం లేదు. రిజర్వ్‌, అన్‌రిజర్వ్‌ టిక్కెట్ల కోసం వేర్వేరు ప్లాట్‌ఫామ్స్‌ను వినియోగించడంలో ఇబ్బందులను గుర్తించిన రైల్వేశాఖ రైల్‌వన్‌ యాప్‌(RailOne App)ను రూపొందించింది ఈ యాప్‌తో అన్ని సేవలనూ ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. రిజర్వ్‌, అన్‌రిజర్వ్‌(జనరల్‌)టిక్కెట్ల బుకింగ్‌, లైవ్‌ ట్రైన్‌ స్టేటస్‌ ట్రాకింగ్‌, జర్నీప్లానింగ్‌, డిజిటల్‌ చెల్లింపులు, టైం సేవ్‌, యూజర్‌ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫే్‌సతో సులభతర ఉపయోగంగా రైల్‌వన్‌ యాప్‌ ఉపయోగపడుతుందని రైల్వేశాఖ చెబుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *