సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరంలో సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం నేడొక ప్రకటన విడుదల చేస్తూ.. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ బెల్లంకొండ వారి మెరక కు చెందిన అత్తా కోడళ్ళు ప్రయివేటు ఫైనాన్స్ సంస్థ వేధింపులకు బలైపోవడం చాలా బాధాకరమన్నారు. బలైపోయిన కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని, సదరు ఫుల్ట్రన్ ఫైనాన్స్ సంస్థపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ తరపున డిమాండ్ చేసారు. మృతుల కుటుంబం గతంలో ఇంటి నిర్మాణం కోసం ఫుల్ట్రన్ అనే ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వద్ద అప్పు తీసుకొని, నెల నెలా అప్పు చెల్లిస్తూ వస్తున్నారన్నారు. ఆర్ధిక ఇబ్బందుల వలన ఈ నెల వాయిదా సకాలంలో చెల్లించలేమని సదరు ఫైనాన్స్ కంపెనీకి తెలియజేసినప్పటికీ వారి ఉద్యోగులు ఇంటికి వచ్చి రుణ వాయిదా చెల్లించకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుంటామని, వేలం వేస్తామని భయబ్రాంతులకు గురి చేయడం, దానితో ఆందోళనకు గురైన అత్తా కోడళ్ళు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.. ఇటువంటి సంఘటనలు జరిగినపుడు మాత్రమే పోలీసు, అధికార యంత్రాంగం హడావుడి చేసి, తర్వాత వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. మైక్రో, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల వేధింపులు నిత్యకృత్యమయ్యాయన్నారు.జిల్లాలో పేరుగాంచిన పేరుపాలెం బీచ్ లో ఇటీవల వరుసగా ప్రమాదాలు జరగడం బాధాకరమన్నారు. ఇటీవల సముద్ర స్నానానికి వెళ్లి నీటమునిగి చనిపోయిన యువకులు కొటికలపూడి అరవింద్, యాళ్ల రాజేష్ మృతికి సిపిఎం జిల్లా కమిటీ సంతాపం తెలియజేసింది.ప్రభుత్వం పేరుపాలెం బీచ్ లో పటిష్ట చర్యలు చేపట్టాలి అని సిపిఎం డిమాండ్ చేసింది. up file photo
