సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ జనాభా ఎక్కువ ఉన్న దేశాలలో చైనా ను అధిగమించి భారత్ నెంబర్ 1 గా నిలబడింది. వరల్డ్ పాపులేషన్ రివ్యూ (డబ్ల్యూ పీఆర్) నివేదిక ప్రకారం గతేడాది చివరి నాటికే భారత జనాభా చైనా కంటే కనీసం 50 లక్షలు ఎక్కువని చెబుతోంది. 2022 డిసెంబర్ 31 నాటికి తమ జనాభా 141.2 కోట్లని చైనా గత మంగళవారం అధికారికంగా ప్రకటించింది. అదే రోజున భారత్ జనాభా 141.7 కోట్లకు చేరిం దని డబ్ల్యూ పీఆర్ అంచనా వేసింది. నిన్న బుధవారం నాటికి 142.3 కోట్లకు ఎగబాకిందని ప్రకటించింది. మన భారత్ జనాభాలో 50 శాతానికి పైగా 30 ఏళ్లో లోపు వయసువారే. కనుక దేశ జనాభా పెరుగుదల 2050 దాకా కొనసాగుతూనే ఉంటుందని భావిస్తున్నారు. 1961 తర్వాత తొలిసారిగా 2022లో తమ జనాభాలో తొలిసారిగా 8.5 లక్షల మేరకు తగ్గుదల నమోదైనట్టు చైనా ప్రకటించింది. ( కరోనా ప్రభావం వల్లనేనా?)
