సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో తమ కూటమి ప్రభుత్వం చేపడుతున్నఅమ్మకు వందనం పథకంపై వైసీపీ, నీలి మీడియా “అమ్మకు వందనం మంగళం” అంటూ అబద్దపు ప్రచారాలు చేస్తోందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేడు, శనివారం మీడియా సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయనున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు.వైసీపీ హయాంలో అమ్మఒడి పేరుతో అమ్మలను మోసం చేశారని, వారికి ఇవ్వాల్సిన నగదులో కోతలు పెట్టారని ధ్వజమెత్తారు. ఎన్డీయే ప్రభుత్వం ఇచ్చే ఉచిత ఇసుకపై అసత్యాలు ప్రచారం చేస్తున్న వైసీపీ నేతల దాడిని ప్రజలే తిప్పికొడుతున్నారని అన్నారు. ఇచ్చిన మాట తప్పే వ్యక్తి జగన్ రెడ్డి అని, ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని నిమ్మల రామానాయుడు అన్నారు. . ఆ పథకంపై ఇంకా విధివిధానాలు రూపొందించక ముందే కొందరు తమ పత్రికల్లో విష ప్రచారాలు చేయడం దుర్మార్గమని , తమ ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటుందని, ప్రతి బిడ్డకూ దీన్ని అమలు చేసి తీరుతామని భరోసా ఇచ్చారు.
