సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయం సాధించిన మ్యాడ్ 2 సినిమా విజయోత్సవం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు పాన్ ఇండియా యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ ముఖ్య అతిధిలు గా పాల్గొన్నిమ్యాడ్ లో పాల్గొన్న యువ హీరోలను తండ్రి పాత్రలో నటించిన మురళీధర్ ను విలన్ గా నటించిన భీమవరం బుల్లోడు సునీల్ ను , దర్శకుడు కళ్యాణ్ శంకర్ ను, నిర్మాతలను అభినందించి సినిమా షేల్డ్ లను అందజేశారు. జూ. ఎన్టీఆర్ తన ప్రసంగంలో.. ఎన్టీఆర్ మాట్లాడుతూ, “అభిమానుల్ని కలిసి చాలా కాలం అయిపొయింది. నిర్మాత నాగవంశీ పుణ్యాన ఇలా కలుసుకోగలిగాం. నవ్వించడం అనేది చాలా గొప్ప వరం. “ఏ ఆర్టిస్టుకి అయినా కామెడీ పండించడం చాలా కష్టం. ఇప్పటికి అదుర్స్2 నా ఆలోచనలో ఉంది. అయితే అదుర్స్2 చేయడానికి బయపడుతున్నా” అని తారక్ అన్నారు. నన్ను అందరూ అడుగుతుంటారు రాముడిగా చేయడం కష్టమా, రావణుడిగా చేయడం కష్టమా అని. రాముడిగా చేయడమే కష్టం. ఇంకో మాట .. దేవర పార్ట్ 2 ఫై అనుమానాలు అక్కరలేదు. తప్పనిసరిగా చేస్తాను. అయితే ప్రస్తుతం చేస్తున్న వార్ 2, ప్రశాంత్ నిల్ సినిమా పూర్తీ అయ్యాక దేవర 2 కచ్చితంగా ఉంటుంది అని ప్రకటించారు.
