సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈసారి ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ద్రుష్టి ఎక్కువ శాసనమండలిలో హోరాహోరీగా జరుగుతున్నా సమావేశాలపై పడింది. అయితే నేడు, బుధవారం కూడా వైసీపీ సభ్యుల నిరసనలతో శానసమండలి వాయిదా పడింది. టీటీడీ లడ్డూలో ఉపయోగించిన నెయ్యి కల్తీ , కొవ్వు.. కల్తీ ఆరోపణలపై సీబీఐ, సిట్ రిపోర్టులు అనంతరం మరో కమిటీ వెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ, ‘ఢిల్లీ’ పర్యటనల తరువాత అధికార కూటమి సభ్యులు వెనక్కి తగ్గినా కూడా, ఆ వివాదంలో దర్యాప్తు నోటీసులలో.. ఇటీవల ఇందాపూర్ డైరీ పేరుతో..‘హెరిటేజ్’ పేరు కూడా ప్రస్తావనకు వచ్చిందని దీనిపై మండలిలో చర్చ జరగాలని వైసీపీ ఎమ్మెల్సీ లు మండలి వేదికగా చర్చ కు పలుమారులు పట్టుపడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీలు సిపాయి సుబ్రమణ్యం, కేఆర్‌జే భరత్‌లు ఇందాపూర్ డైరీ పేరుతో(నిన్నచైర్మెన్ తిరస్కరించినప్పటికీ) టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిపై చర్చకు డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. వారు ఇచ్చిన వాయిదా తీర్మానాలను నేడు, బుధవారం మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు మరోసారి తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు తీవ్ర ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లి ప్లకార్డులతో నిరసన తెలిపారు. సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. అంతకుముందు అసెంబ్లీ లాబీలో మంత్రి నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. . మండలిలో వైసీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ పార్టీ సభ్యులను అదుపులో పెట్టలేకపోతున్నారని వారిపై గ్రిప్ కోల్పోయారని అన్నారు.
