సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దర్శక ధీరుడు రాజమౌళి సమర్పణలో.. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో అమితాబ్ , నాగార్జున ప్రధాన పాత్రలలో రణబీర్ కపూర్, అలియా భట్, జంటగా షారూఖ్ ఖాన్, అతిధి పాత్రలలో నటించిన 400 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన బ్రహ్మస్త్రం నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కధ విషయానికి వస్తే.. అస్త్రాలన్నిటికీ అధిపతి బ్రహ్మాస్త్ర. ఈ బ్రహ్మాస్త్రని మూడు భాగాలుగా చేసి దుష్టుల చేతికి చిక్కకుండా బ్రహ్మాన్ష్ గ్రూప్ కాపాడుతూ ఉంటుంది. బ్రహ్మాస్త్ర లోని ఒక భాగం బ్రహ్మాన్ష్ గ్రూప్ కు చెందిన అనీష్(నాగార్జున) దగ్గర ఉంటే, రెండో భాగం శాస్త్రవేత్త మోహన్ భార్గవ్(షారుఖ్ ఖాన్) వద్ద ఉంటుంది. అలాగే మూడో భాగం ఎక్కడుంది ? అని కథా గమనంలో తెలుస్తోంది. మొత్తానికి విడి విడిగా ఉన్న ఈ మూడు భాగాలను కలిపి, ఆ బ్రహ్మాస్త్ర ని పొందాలని మౌనీ రాయ్ అండ్ విలన్ గ్రూప్ అనేక ప్రయత్నాలు చేస్తూ.. బ్రహ్మాన్ష్ గ్రూప్ కు చెందిన వ్యక్తులను చంపుకుంటూ బ్రహ్మాస్త్ర భాగాలు కోసం వెతుకుతూ ఉంటారు. అయితే, ఇదంతా డీజే శివ(రణబీర్ కపూర్)కి కళ్ళ ముందు విచిత్రంగా జరుగుతున్న భావన కలుగుతుంది. తనలో తానే మానసిక బాధ అనుభవిస్తూ ఉంటాడు. ఇలాంటి సమయంలో శివ, ఇషా(అలియా భట్) ను చూసి ప్రేమలో పడతాడు. మరి తన ప్రేమ కోసం శివ ఏం చేశాడు?, అలాగే బ్రహ్మాస్త్ర ను కాపాడటానికి గురువు (అమితాబ్ బచ్చన్)తో కలిసి ఎలాంటి పోరాటం చేశాడు ?, అనేది మిగిలిన కథ.అత్యంత భారీ అంచనాలతో వచ్చిన ఈ అద్భుతమైన గ్రాఫిక్ విజువల్ యాక్షన్ ఎమోషనల్ ఫాంటసీ సినిమాలో భారీ తారాగణం ఉంది. అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున, షారుఖ్ ఖాన్ అలాగే రణబీర్ – అలియా ఇలా ప్రతి సన్నివేశం స్టార్ల పైనే నడుస్తోంది. షారుఖ్ ఖాన్ , నాగార్జున, అమితాబ్ నటన, వీరి పాత్రల బలం సినిమా కు పెద్ద ప్లస్ పాయింట్ . హీరోగా రణబీర్ కూడా చాలా బాగా నటించాడు. హీరోయిన్ గా నటించిన అలియా భట్ తన నటనతో ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించింది. అయితే వీరి లవ్ ట్రాక్ లో ఎదో తగ్గింది. అయితే సినిమా మాత్రం అద్భుతమైన విజువల్స్ తో ఆకట్టుకున్నా.. చాలా సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే, సెకండ్ హాఫ్ లో చాలా సన్నివేశాలు లో పీల్ కనపడదు. ఇక యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. ఇక సంగీత దర్శకులు సమకూర్చిన పాటలు ఏవరేజ్ గా ఉన్నాయి. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.
