సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేవలం 2 ఎంపీ సీట్లతో ప్రారంభమయిన బీజేపీ పార్టీ ప్రస్థానాన్ని జై శ్రీరామ్ అంటూ.. తన సింగిల్ రద యాత్రతో అధికారానికి దగ్గర చేసిన బీష్మ పితామహుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీకి దేశంలో అచ్చున్నత పునస్కారం భారతరత్న అవార్డును ఇవాళ స్వయంగా అద్వానీకి ఇంటికి వెళ్లి రాష్ట్రపతి ద్రౌపతిముర్ము ప్రధానం చేశారు. నిన్న రాష్ట్రపతి భవన్ లో 4గురు మహానుభావులకు మరణానంతరం వారి బంధువులకు భారత రత్న ప్రధానం చేసిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము నేడు, ఆదివారం ఉదయం అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన బయటికి రాలేని పరిస్థితులు ఉన్న ఎల్ కే అద్వానీ కి స్వయంగా అవార్డు ప్రదానం చేసారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉప రాష్ట్రపతి జగదీష్ ధన్కర్, వెంకయ్య నాయుడులు ఉన్నారు
