సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ ప్రభుత్వం తెచ్చిన వాలంటీర్ వ్యవస్థ కరోనా సమయంలో వారి సేవలు దేశంలో పలు రాష్ట్రాలకు ఆదర్శమయిన విషయం తెలిసిందే.. మరి లక్షలాది మంది యువత సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థ ఫై టీడీపీ అధినేత, చంద్రబాబు, అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు పలు సార్లు వివాదాస్వాద వ్యాఖ్యలు చేసి వాలంటీర్లు లో ఆందోళన ఆగ్రహం కలిగించిన నేపథ్యంలో ..ఎన్నికల ముగింట.. తాజాగా నేడు, సోమవారం నాడు పెనుకొండలో జరిగిన ‘రా కదలి రా’ భారీ బహిరంగ సభా వేదికగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన చంద్రబాబు.. వాలంటీర్లకు మాత్రం భరోసా ఇచ్చారు. ..మేం అధికారంలోకి వస్తే వలంటీర్లను తీసేయం.. ఎవరి ఉద్యోగం తొలగించం. అసలు ఆ ఆలోచనే చెయ్యం. వారికి కచ్చితంగా న్యాయం చేస్తాం. మళ్లీ చెబుతున్నా.. తప్పకుండా వలంటీర్ల వ్యవస్థను కంటిన్యూ చేస్తాం. వలంటీర్లకు మంచి భవిష్యత్ ఉంటుంది. అయితే వాలంటీర్లు ఎవరూ వైసీపీ కోసం పనిచేయవద్దు.. ప్రజల కోసమే పని చెయ్యండి ’ అని వలంటీర్లకు చంద్రబాబు భరోసా ఇస్తూ వారికీ తనపై ఉన్న అపనమ్మకం తొలగించే వ్యాఖ్యలు చేసారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *