సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి నేడు, బుధవారం తెడే పల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ”రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి హాని కలిగించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. సీఎం చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతో రాష్ట్ర ప్రజలను పెద్ద మోసం చేశారు. ఓట్లు పొందడానికే అన్నట్లుగా ఈ హామీలు నిలిచిపోయాయి. యువతకు నిరుద్యోగ భృతి లేదు. కొత్త ఉద్యోగాలు మాట దేవుడు ఎరుగు .. 3 లక్షల మందికి ఉన్న ఉద్యోగాలు పీకేశారు. 50 ఏళ్ళ పైబడిన వారికీ ‘పింఛన్’ లు ఇస్తామని మాయ మాటలు చెప్పారు. ఉన్న పించెన్లే 5 లక్షల మందికి పైగా పీకేశారు. మహిళలు ఎక్కడినుంచి ఎక్కడికైనా ఉచిత బస్సు అన్నారు. తిరుపతి నుండి విశాఖ వెళ్లిపోవచ్చు అని చంద్రబాబు అన్నారు. మరి ఎవరిని ?తీసుకెళ్లారు. ప్రతి మహిళకు ఏడాదికి రూ.18 వేలు ఇస్తామన్న హామీ ఏమైంది. విద్యార్థులకు పీజు రియంబర్స్ సక్రమంగా చెల్లించక చాల మంది కాలేజీ చదువులు మధ్యలో మానేశారు. ఇక వసతి దీవెన మొత్తానికే ఎత్తేసారు. రాష్ట్రంలో ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నిరసనలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. రైతులు, విద్యార్థులు తమ ఆశలను కోల్పోతున్నారు. కరెంట్ ఛార్జీలను ఏడాదిలోనే రూ.15 వేల కోట్లకు పెంచారు. దీనివల్ల సామాన్యులు నలిగిపోతున్నారు. ఎమ్మెల్యేలు మంత్రులు ఇసుక మద్యం మాఫియా, పేకాట క్లబ్ లు యదేచ్చగా నడుపుకొంటున్నారని .. నా పర్యటనల్లో వైసీపీకి వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక పార్టీ కార్యకలాపాలను అణిచివేయాలని నేతల అందరిపై కేసులు అక్రమంగా పెడుతున్నారు, నిజాయితీ అయిన పోలీస్ అధికారులు ఉద్యోగాలు వదిలేసుకొంటున్నారు. మరో 3 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుంది. మీరు ఏది విత్తరో అప్పుడు అదే పండుతుంది అని జగన్ హెచ్చరించారు
