సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం తెదేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ అధికారులతో .. రాష్ట్ర అభివృద్ధి సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనపై సమీక్ష నిర్వహించారు. ప్రగతి అంకెల రూపంలో కాదు…వాస్తవ రూపంలో ఉండాలని, వాటి ఫలాలు ప్రజలకు ఎంత మేర అందయో తెలియాలని జగన్ అధికారులకు సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో విప్లవాత్మక వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. ఆధార్ వివరాలతో డేటాను నిక్షిప్తం చేసి వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని సీఎం సూచించారు. అలాగే రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం ముఖ్యమని, చాలామందిలో రక్తహీణత నివారణకు సంపూర్ణ పోషన ప్లస్ అమలు చేయాలన్నారు. అధికారులు నెలలో 2 సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలని సూచించారు. ప్రతి విభాగానికి మండలాల వారీగా అధికారులను నియమించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *