సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో కురుస్తున్న వర్షాలకు విజయవాడ గుంటూరు జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. సరైన సహకారం అందటం లేదని కరెంట్ తిండి లేక పస్తులు ఉంటున్నామని, పిల్లలతో పరిస్థితి ఘోరంగా ఉందని అనేక కుటుంబాల వారు విలపిస్తున్నారు. .కొందరు ప్రజలు ఇళ్లలో నీరు చేరి నిస్సహాయంగా ఉన్న కుటుంబాల వద్దకు కొందరు బోట్లపై వెళ్లి 1000 నుండి 1500 చెల్లిస్తేనే బోటు ఎక్కించుకొంటామని డిమాండ్ చేస్తూ వ్యాపారం చేసుకోవడం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా విజయవాడలోనే పరిస్థితులు సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు అధికారుల తీరుపైతీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేడు, మంగళవారం తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. కొందరు అధికారులు తన ఆదేశాలు పాటించడం లేదని, జీతాలు తీసుకోని పని చెయ్యరా? మృతదేహం ఉంటే చూసీ చూడనట్టు వెళ్లిపోతారా?.. కనీసం మానవత్వం తో వ్య వహరించడం లేదంటూ వారిని ఎవరిని వదిలే ప్రశ్న లేదని హెచ్చరించారు. అలాగే కొందరు మంత్రులు కూడా వరద సహాయక చర్యలలో పాల్గొనకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారిని ఉపేక్షించమని హెచ్చరించారు.
