సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో కలెక్టరేట్ లో నేడు, గురువారం AP JAC, AP NGGOs అసోసియేషన్ జిల్లా చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘ నాయకులు జిల్లా కలెక్టర్, సి హెచ్ . నాగరాణి గార్ని కలసి ఇటీవల కాకినాడ మెడికల్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కాండ్రేగుల రాధాకృష్ణ అధికారుల వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొన్న సంఘటన ను ఖండిస్తూ దానికి కారణమైన ఆ అధికారి పై చర్యలు తీసుకోవాలని APNGGOs జిల్లా శాఖ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లు కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్జీజీవోస్ అసోసియేషన్ కార్యదర్శి నెరుసు రామారావు.. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెనుమరెడ్డి శ్రీనివాస్ ,మెడికల్ శాఖ మినిస్టీరియల్ సంఘ నాయకులు..చీకట్ల శివాజీ..ఇతర ఎన్జీవోస్ అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు కలిశారు..కలెక్టర్ నాగ రాణి మాట్లాడుతూ ..ఉద్యోగులకు ఎప్పుడూ అండగా ఉంటామని రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు..
